South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్టుకు ప్రయత్నం విఫలం
South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. అధ్యక్షుడి భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో.. ఆరు గంటల ప్రతిష్టంభన తర్వాత పోలీసులు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు.
సియోల్: దక్షిణ కొరియా(South Korea) అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్టుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో అరెస్టును వాయిదా వేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. సుమారు ఆరు గంటల పాటు.. అధ్యక్షుడి భద్రతా సిబ్బందితో పోలీసులు వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఘటనలో యూన్‌పై నిఘా సంస్థలు దర్యాప్తు చేపడుతున్నాయి.
దేశంలో మార్షియల్ లాను అమలు చేయాలని గత డిసెంబర్లో యూన్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అధ్యక్షుడు యూన్‌పై విపక్షాలు అభిశంసన ప్రకటించాయి. దీంతో దక్షిణకొరియాలో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడింది. పలు కేసుల్లో విచారణకు హాజరుకావాలని సియోల్ కోర్టు ఇటీవల ఇచ్చిన సమన్లను యూన్ బేఖాతరు చేశారు. మూడు సార్లు ఆయన సమన్లను విస్మరించారు. దీంతో ఇటీవల సియోల్ కోర్టు.. యూన్ అరెస్టుకు వారెంట్ జారీ చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

