Harish Rao | మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దని నిపుణులు ఎక్కడా చెప్పలేదని.. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించేందుకు అనుకూలంగానే ఉందని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఇచ్చిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ విషయమై తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. మేడిగడ్డ నుండి 160 టీఎంసీల నీళ్లు మిడ్ మానేరు తీసుకువెళ్లేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయా లేదా అన్న దాని గురించి మా కమిటీ వేశారని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు.
పీసీ ఘోష్ కమిషన్కు కూడా ఈ రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఇచ్చిందని హరీశ్ రావు అన్నారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొచ్చు కానీ నేరుగా మిడ్ మానేరుకు నీరు తీసుకెళ్లడం సాధ్యం కాదని ఆనాడు కమిటీ చెప్పింది. కమిటీ సూచనల మేరకు నేరుగా నీళ్లు తరలించే ప్రతిపాదనను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపసంహరించుకుందని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ పీసీ ఘోష్ కమిషన్కు నివేదిక ఇచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మేము చెప్పినట్టే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని అఫిడవిట్ రూపంలో పీసీ ఘోష్ కమిషన్కు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ తెలిపింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ రిపోర్టు పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
మేడిగడ్డ దగ్గర చిన్న రబ్బర్ డ్యామ్ వేసి మోటార్లు ఆన్ చేసి కాళేశ్వరం నీళ్లు వాడుకోవచ్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజనీర్లు ఒక రిపోర్ట్ ఇచ్చారని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రిపోర్ట్ బయట పెట్టు అని హరీశ్ రావు సవాల్ విసిరారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన ENCని వారం రోజుల్లోనే ట్రాన్స్ఫర్ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా రిటైర్ చేశారు. మీకు కాళేశ్వరం అంటే అంత పగా, ప్రతీకారం ఎందుకు..? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టొద్దని నిపుణులు ఎక్కడా చెప్పలేదు
మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించేందుకు అనుకూలంగానే ఉందని రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఇచ్చింది
మేడిగడ్డ నుండి 160 టీఎంసీల నీళ్లు మిడ్ మానేరు తీసుకువెళ్లేందుకు పరిస్థితులు అనుకూలిస్తాయా లేదా అన్న దాని గురించి మా… pic.twitter.com/mNQR2DSAe3
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2026