మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలో సర్వే , భూ రికార్డుల కార్యాలయ సూపరింటెండెంట్ ( Superintindent ) వేంకటేశ్వర్ రెడ్డి ( Venkateshwar Reedy ) లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. భూత్పూర్ మండలంలో గ్రామ పటాన్ని సరిచేయడానికి సంబందించి ఫిర్యాదుదారుడు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ( ACB ) అధికారులు మాటువేసి పట్టుకున్నారు.
ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన ఘటన వివరాలను ఏసీబీ అధికారులు వివరించారు. సూపరింటెండెంట్‌పై కేసు నమోదు చేసి రూ. 15 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.