Excise Income | రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 2025-26 సంవత్సరంలో రూ.40,209 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా రూ. 40 వేల కోట్ల ఆదాయానికి చేరుకోవడం రికార్డుగా చెప్పుకోవచ్చు. 2018-19 అర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌శాఖకు రూ.20,859 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం ఏడు సంవత్సరాల్లో 2025‘26 నాటికి రూ. 40.209 కోట్లకు చేరుకుంది. 2024-25 అర్ధిక సంవత్సరంలో రూ.37,487 కోట్ల ఆదాయం మద్యం అమ్మకాల ద్వారా రాగా, 2025-26లో గత సంవత్సరంతో పోలిస్తే రూ.2722 కోట్ల మద్యం అమ్మకాలు అదనంగా పెరిగాయి.
పెరిగిన మద్యం అమ్మకాలు..
గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 7 శాతంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. 2025-26 అర్థిక సంవత్సరంలో 382.91లక్షల కేసుల లిక్కర్, 387.34 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి.2025-26 అర్థిక సంవత్సరంలో 2 శాతం లిక్కర్ సెల్స్ పెరుగగా, బీరు అమ్మకాలు 9 శాతంగా తగ్గాయి. 2024-25 అర్థిక సంవత్సరంలో 372.25 లక్షల కేసుల లిక్కర్, 536.13 లక్షల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరం తో పోలిస్తే బీరు అమ్మకాలు తగ్గాయి, లిక్కర్ అమ్మకాలు కొద్దిపాటిగా పెరిగాయి.
2025-26 అర్థిక సంవత్సరంలో నెలవారీగా మద్యం అమ్మకాలు ఎలా ఉన్నాయి. ఏప్రిల్‌లో రూ.3272 కోట్లు, మేలో రూ.3561 కోట్లు, జూన్‌లో రూ. 3273, జూలైలో రూ.3320 కోట్లు, ఆగస్టులో రూ. 3082 కోట్లు సెప్టెంబరులో రూ.3048 కోట్లు, ఆక్టోబర్‌లో రూ.2709 కోట్లు నవంబర్‌లో రూ.2868 కోట్లు , డిసెంబరులో రూ.5,051 కోట్లు, 2026 జనవరిలో రూ.3325 కోట్లు, ఫిబవ్రరి రూ.3208 కోట్లు, మార్చి 31 రూ.3486 కోట్లు మొత్తంగా రూ. 40,209 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.
ఎక్సైజ్‌శాఖకు 2620 ఏ -4 మద్యం షాపుల ద్వారా సంవత్సరానికి రెంటల్ ఫీజ్ ద్వారా రూ. 1771 కోట్ల ఆదాయం సమకూరింది. 1214 బార్ల ద్వారా రూ. 549 కోట్ల ఆదాయం వస్తుంది. 2025-26 అర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖకు 95,628 దరఖాస్తుల ద్వారా రూ. 2869 కోట్ల ఆదాయం అదనంగా వచ్చింది.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఎక్సైజ్ ఆదాయం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పుష్కర కాలంగా ఎక్సైజ్‌శాఖకు అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. 2015-16లో రూ. 12,706 కోట్లు, 2016-17లో రూ. 14.184 కోట్లు, 2017-18లో రూ.17,597 కోట్లు, 2018-19లో రూ.20,859 కోట్లు, 2019-20లో రూ.22,605 కోట్లు, 2020-21లో రూ.27,286 కోట్లు 2021-22లో రూ.30,783 కోట్లు , 2022-23లో రూ. 35,145 కోట్లు , 2023-24లో రూ.37,675 కోట్లు , 2024‘25లో రూ.37,488 కోట్లు 2025‘26లో రూ. 40,209 కోట్ల ఆదాయం వచ్చింది.