Ex Counsellor Attack| వెంకటేశ్వర కాలనీ జనరల్ బాడీ మీటింగ్‌లో రసాభాస చోటుచేసుకుంది. సమావేశంలో కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ పద్మారావు హల్ చల్ సృష్టించాడు. కాలనీవాసులపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. పద్మారావు కాలనీ వాసులను బూతులు తిడుతూ స్టేజ్‌పై నుండి దిగి దాడి అనుచరులతో కలిసి పిడి గుద్దుల వర్షం కురిపించాడు.
రాజ్ కుమార్ అనే వ్యక్తిపై దాడి చేసిన పద్మారావు.. అడ్డు వచ్చిన వారినీ వదలకుండా వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. పద్మారావు చేతికి కడియం వేసుకొని ఉండగా.. అతడు అసోసియేషన్ ప్రతినిధి రాజ్ కుమార్ తలపై దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. పద్మా రావు అనుచరులు కర్రలు కూడా వెంట తీసుకొని వచ్చారు. పద్మారావు దాదాపు పది మందితో కలిసి పక్కా ప్లాన్‌తోనే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
అసోసియేషన్‌ను అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డాడని.. సుమారు రెండు కోట్లవరకు వసూళ్లు చేసినట్లుగా పద్మారావుపై ఆరోపణలున్నాయి. ఇదే విషయంపై సమావేశంలో అసోసియేషన్ సభ్యులు ప్రశ్నించేసరికి వారిపై పద్మారావు దాడికి పాల్పడ్డాడు.
కాలనీవాసులపై దాడి వీడియో..
Edupayala Temple | పెరిగిన వరద.. వనదుర్గ ఆలయం మరోసారి మూసివేత
Rayapole | కొత్తపల్లిలో పడకేసిన పారిశుధ్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
Tragedy | రెండేళ్ల కూతుర్ని పాతిపెట్టి.. ప్రియుడితో పరారైన మహిళ.. మూడు నెలల తర్వాత బయటపడ్డ నిజం!