KTR | పిల్లలతో గడిపే ప్రతీ క్షణం ఆనందాన్నిస్తుంది.. ఆధునిక లైబ్రరీ నిర్మాణానికి పూర్తి సహకారం : కేటీఆర్
KTR | పిల్లలతో గడిపే ప్రతి క్షణం ఆనందాన్ని ఇస్తుంది. సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం కూడా అందించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట బ్రాహ్మణవాడిలో ఉన్న స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్‌ను కేటీఆర్ సందర్శించారు.
KTR | హైదరాబాద్‌లోని బేగంపేట బ్రాహ్మణవాడిలో ఉన్న స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్‌ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. అనంతరం తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్ స్కూల్లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 2023లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభించిన ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం’ను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో విద్యారంగంలో అనేక కార్యక్రమాలు చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ విద్యార్థుల సంక్షేమానికి దోహదపడే ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని తెలిపారు. పిల్లలతో గడిపే ప్రతి క్షణం ఆనందాన్ని ఇస్తుంది. సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారం కూడా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్‌కు అవసరమైన అదనపు తరగతి గదులు, ఆధునిక లైబ్రరీ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. విద్యార్థులకు అండగా నిలుస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్సీ సురభి వాణీదేవి సేవలను ఆయన ప్రశంసించారు.
Live: స్వామి రామానంద తీర్థ మెమోరియల్ మోడల్ స్కూల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం https://t.co/ndjGcwqgQG
— BRS Party (@BRSparty) June 18, 2026
Read Also :
Uttar Pradesh | బ్యాంక్ లాకర్లో పెట్టిన 96 గోల్డ్ ప్యాకెట్లు మాయం.. యూపీలో ఘటన
Batwara 1947 | దేశ విభజన నేపథ్యంలో సన్నీ డియోల్ ‘బట్వారా 1947’.. ఆసక్తికరంగా టీజర్!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- KTR
- midday meal
- students
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

