హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): వేగంగా పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పర్యావరణ అనుకూల, అధునాతన సాంకేతిక ఆధారిత బస్సు రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ఢిల్లీలో రెండ్రోజులుగా నిర్వహించిన ‘యూఐటీపీ ఇండియా బస్ కాన్ఫరెన్స్-2026’లో ఆయన కన్వీనర్ హోదాలో మాట్లాడారు.
ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, చార్జింగ్ సదుపాయాలు, డిజిటల్ చెల్లింపులపై ఈ సదస్సు రోడ్ మ్యాప్‌ను ఆవిషరించిందని అన్నారు. టీజీఎస్ ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయడంతోపాటు ఆర్థికంగా, నిర్వహణపరంగా బలోపేతం చేసేందుకు చేపడుతున్న విప్లవాత్మక నిర్ణయాలను సంస్థ ఎండీ తన ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.