హైదరాబాద్: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ (Shiva Balakrishna) అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ (ED) దూకుడు పెంచింది. ఆయన బినామీ పెట్టుబడులపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా ఆయన పెట్టుబడులు పెట్టిన మూడు రియల్ ఎస్టేట్ కంపెనీలపై దాడులు (ED Raids) నిర్వహిస్తున్నది. శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్, క్వారీస్ స్పైసెస్, ఉదయ ఎస్ఎస్వీ ప్రాజెక్టులో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. లక్టీకాపూల్, కొండాపూర్, రామంతాపూర్లోని కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అధికారాన్ని ఉపయోగించి అక్రమ అనుమతులు ఇచ్చి సోదరుడు నవీన్ కుమార్తో కలిసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ గుర్తించింది. బినామీ పేర్లతో రూ.కోట్లలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టినట్లు తేలింది.
కాగా, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రూ.250 కోట్ల మేర అక్రమ ఆస్తులను గుర్తించింది. ఇదే కేసులో ఈ నెల 2న శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ ఇండ్లపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. రాజేంద్రనగర్తోపాటు చైతన్యనగర్లోని వారి నివాసాల్లో సోదాలు జరిపారు. ఏసీబీ నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నది. శివబాలకృష్ణ రూ.250 కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు గత సోదాల్లోనే ఏసీబీ గుర్తించింది. 200 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు ఇంటి స్థలాలు, విల్లా తదితర ఆస్తులు ఉన్నట్టు తేల్చింది.
“ఒక్కో సెటిల్మెంట్కు రూ.కోటి”
“శివబాలకృష్ణకు సహకరించిదెవరు?”