Dudimetla Balaraju Yadav | కాంగ్రెస్ పాలనలో ప్రశ్నిస్తే, అడిగితే , మాట్లాడితే భౌతిక దాడులు చేస్తున్నారని.. విసునూరి రాంచంద్రారెడ్డి వారసుడు రేవంత్ రెడ్డి అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలరాజు యాదవ్ మాట్లాడుతూ.. భూపాలపల్లిలో DTO వెంకన్నను లారీలతో తొక్కించి చంపేశారు. రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పింది, అసమర్థ, పనికిరాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మైనంపల్లి హనుమతురావుకు పిచ్చిపట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండు. ప్రజల్లో పేరున్న నాయకుడు కేటీఆర్, ఏడాదిలోనే సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిచాడు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో 68,219 ఓట్ల మెజార్టీతో గెలిచిన నాయకుడు కేటీఆర్. మైనంపల్లి హనుమతురావు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడన్నారు.
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు..
మైనంపల్లి హనుమతురావు పైన కేసు నమోదు చెయ్యకుండా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కేసీఆర్ స్ఫూర్తితో కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజలకు కోసం పని చేస్తున్న కేటీఆర్ ను ఊసరవెల్లి లాంటి హనుమంతరావు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని బాలరాజు యాదవ్ హెచ్చరించారు. రాజకీయ బిక్ష కోసం కేటీఆర్ కాళ్లు పట్టుకున్న వ్యక్తి హనుమంతురావు. ఖబడ్దార్ మైనంపల్లి హనుమతురావు, ఇంకోసారి కేటీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన సర్వేలో ఇప్పుడు మాట్లాడే నాయకులు ఓడిపోతున్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సైనికులుగా మారి ఒక్కొకరి తుక్కు వదలగొడుతామన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇంకోసారి ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు. 1983 నుంచి కేసీఆర్ హయం వరకు కేబినెట్ లో యాదవులు మంత్రులుగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో యాదవ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. మోసపూరిత హామీలతో ఈ ప్రభుత్వం యాదవులను మోసం చేసింది. 7 వేల కోట్ల రూపాయలు కేసీఆర్ హయాంలో గొల్ల కురుమల కోసం ఖర్చు చేశాం. బీర్ల ఐలయ్య యాదవ్ యాదవ సామాజిక వర్గం కోసం పనిచేయడం లేదు. ముఖ్యమంత్రి ఢిల్లీకి తిరిగితే, మా నాయకులు గల్లీలో తిరుగుతున్నారన్నారు బాలరాజు యాదవ్.
అర్జెంట్ గా మైనంపల్లి హనుమంతురావును పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాలి. BC డిక్లరేషన్ కు సిద్ధ రామయ్యను తీసుకొచ్చి ఆయన గొంతు కోశారు. సిద్ధిపేట, సిరిసిల్ల తరువాత , మైనంపల్లి హనుమతురావు ముందు మల్కాజ్ గిరి గెలవాలి. గూట్లో రాయి తియ్యలేనోడు, ఏట్లో రాయితీస్తా అంటే ఎలా. .. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లడం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. మరి ఇందిరాగాంధీ కోడలు మేనక గాంధీ కాంగ్రెస్ లో ఎందుకు లేరు..? బయటకు వెళ్లి పార్టీ ఎందుకు పెట్టుకున్నారు .. ఆమె కొడుకు వరుణ్ గాంధీ బీజేపీలో ఎందుకు ఉన్నారు? .. రేవంత్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కలవడం లేదు.. టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకే అపాయింట్ మెంట్ ఇస్తున్నారు.
పాత కాంగ్రెస్ వాళ్లను రేవంత్ కలవడం లేదు..కాంగ్రెస్‌లో కుతకుత లాంటి పరిస్థితి ఉంది ..ఎపుడు ఎం జరుగుతుందో తెలియదు ..ముందుంది మొసళ్ల పండగ .. మైనం పల్లి ఒకసారి కేటీఆర్ మీద మాట్లాడితే వదిలి పెట్టాం .రెండో సారి మాట్లాడితే పోనీ అనుకున్నాం .ఇక వదిలి పెట్టం ..పిచ్చి పిచ్చి మాట్లాడితే మూతి పగలగొట్టడమే ఉంటుంది.. హైదరాబాద్ కు పెట్టుబడులు తెచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన కేటీఆర్ ను అంటే ఊరుకుంటామా ? ..సోషల్ మీడియాలో మైనం పల్లి మనుషులు కేటీఆర్‌పై అడ్డమైన ట్రోలింగ్ లు చేస్తున్నారు. బాల్కసుమన్ మీద అక్రమ కేసు పెట్టారు. మైనంపల్లి ఆయన కొడుకు రోహిత్ అండ్ కో మీద కేసులు పెట్టరా .. సీఎం రేవంత్ మెప్పు కోసం మైనంపల్లి కేటీఆర్‌ను టార్గెట్ చేశారని ప్రజలకు ఇప్పటికే అర్థమైంది.