సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ట్రేడింగ్‌లో(Trading) సీనియర్ కన్సల్టెంట్ అంటూ వాట్సాఫ్‌కు ఒక సైబర్ నేరగాడు(Cyber criminals) పంపించిన మెసేజీకి స్పందించిన ఒక ప్రైవేట్ ఉద్యోగి రూ. 2.3 లక్షలు పొగొట్టుకోగా మరో కేసులో బాధితుడు రూ.10 లక్షల వరకు నష్టపోయాడు. సైబర్‌నేరగాళ్లు వాట్సాఫ్ ద్వారా ట్రేడింగ్‌కు సంబంధించిన టిప్ప్ పంపిస్తామంటూ నమ్మించడంతో బాధితులు నమ్మారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ దిగుడ్గైస్ఇంట్.కామ్ పేరుతో ఉన్న వెబ్సైట్ లింక్‌ను పంపించారు.
అనంతరం సైబర్‌నేరగాళ్లు తయారు చేసిన యాప్‌ను డైన్లోడ్ చేయించి, ఆ యాప్ ద్వారా దప దఫాలుగా బాధితుల నుంచి పెట్టుబడులు పెట్టించారు. పెట్టిన పెట్టుబడికి యాప్‌లో రెట్టింపు లాభాలు కన్పిస్తున్నా, వాటిని విత్ డ్రా చేసుకునే పరిస్తితి లేకపోవడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితులు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Osmania University | ఓయూలో ఆంధ్రా వ్యక్తులకు పెద్ద పీట.. భగ్గుమంటున్న విద్యార్థి సంఘాలు
SRDP | ఆరాంఘర్ – జూపార్క్ ఫ్లై ఓవర్ ప్రారంభం.. ఎస్ఆర్డీపీ ఫలమిదీ..
Liquor bottles | హైదరాబాద్‌లో భారీగా అక్రమ మద్యం సీజ్..