Collector Pratima Singh | ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహణలో భాగంగా ప్రజల సౌకర్యార్థం మెదక్ జిల్లాలోని మెదక్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ విషయమై కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు l సన్నాహక, శిక్షణ, ముద్రణా కార్యక్రమాలు, జూన్ 25వ తేదీ నుండి జూలై 24వ తేదీ వరకు బూత్ స్థాయి అధికారుల ఇంటింటి సందర్శన, జూలై 24వ తేదీన పోలింగ్ కేంద్రాల హేతు బద్దీకరణ, 31వ తేదీన ముసాయిదా జాబితా ప్రచురణ నిర్వహించడం జరుగుతుందన్నారు.
జూలై 31వ తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందని, సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఫిర్యాదులు, అభ్యంతరాల పరిష్కారం ప్రక్రియ తరువాత అక్టోబర్ 1వ తేదీన తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు.
ఈ క్రమంలో ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ 9553866388 నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పని దినాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, సందేహాలు, సమాచారం కొరకు కంట్రోల్ రూమ్ నం. లో సంప్రదించవచ్చని తెలిపారు.