RS Praveenkumar | బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ అడిషనల్ డీజీపీ డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యక్తిగత సిబ్బందితోపాటు కారు సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ సర్కార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబంపై మరో కుట్రకు తెరలేపింది. ప్రభుత్వ అవినీతిని, కుంభకోణాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించినందుకు ఆయన సతీమణి లక్ష్మీభాయిని బదిలీ చేసింది.
లక్ష్మీభాయిని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ పోస్ట్ నుండి డిపార్ట్మెంట్ ఆఫ్ కో ఆపరేషన్ శాఖలో అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు ఇవాళ ఉదయం కేవలం నిమిషాల్లోనే ఆర్డర్స్ జారీ చేసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై ఒత్తిడి చేస్తూ ఇలా ఆయన సతీమణి లక్ష్మీభాయిని ఆగమేఘాల మీద బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబంపై ప్రభుత్వం కుట్ర
ప్రభుత్వ అవినీతిని,కుంభకోణాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించినందుకు ఆయన సతీమణి లక్ష్మీభాయికి ట్రాన్స్ఫర్
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ పోస్ట్ నుండి డిపార్ట్మెంట్ ఆఫ్ కో ఆపరేషన్ శాఖలో అప్రాధాన్య పోస్టుకు… https://t.co/iEHsoZL3Mb pic.twitter.com/VpFVjC4D0L
— Telugu Scribe (@TeluguScribe) July 2, 2026