Harish Rao | నాకు దక్కనిది ఎవరికి దక్కొద్దని ఆ ఆరుగురిని ఎట్లా అయితే దారుణంగా కోడిని మెడకాయ కోసినట్టు కోసి చంపేసిండు. ఒక ఉన్మాదిలా వ్యవహరించాడు. పాపం ఇప్పుడక్కడ ఒక్క అమ్మాయి మిగిలింది. ఆమెకు చెవులు వినబడవు.. మాటలు రావు. కాళ్లు లేవు.. ఇప్పుడమ్మాయి పరిస్థితి ఏంటి..? ఇంట్లో ఆరుగురిని వాడు చంపేసిండు. ఒక్కతే మిగిలింది.. పసిపాప పరిస్థితేంటి. ఇంత జరిగితే ఈ సంఘటన మీద పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిండు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఆ సంఘటనపై స్పందించలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రానికి చెందిన ఓ ఉన్నతాధికారి, పోలీసాఫీసర్ నిన్న హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో నిన్న మధ్యాహ్నం పూట గోల్ఫ్ ఆడుతున్నాడు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది.. ముఖ్యమంత్రి పాలన ఎట్లుంది అంటే.. నువ్వెట్లున్నవో నీ పరిపాలన కూడా గట్లే ఉందన్నాడు. ఆనాడు కేసీఆర్ ప్రాణాలకు తెగించి చావు నోట్లోకి వెళ్లి 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారు. కానీ ఎన్నడూ కేసీఆర్ రక్తం పారించే ప్రయత్నం కానీ ఎవరి రక్తాన్ని అడగలేదు.
తన రక్తాన్నిచ్చి, తన ప్రాణాన్నిచ్చి రాష్ట్రాన్ని సాధించే ప్రయత్నాన్ని చేసింది కేసీఆర్. కానీ నువ్వు ప్రశ్నించనవాళ్లను, రైతుల పక్షాన నీళ్లు అడిగినటువంటి వాళ్లను కోస్తా రక్తం పారిస్తా అని మాట్లాడుతున్నవ్. ఇది కేసీఆర్కు నీకున్న తేడా అని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
Live: తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మీడియా సమావేశంhttps://t.co/qNI2aApmmJ
— BRS Party (@BRSparty) July 12, 2026