Harish Rao | రైతుల పంట పొలాల్లో నీళ్లు పారించండి ముఖ్యమంత్రి అంటే మా రక్తాన్ని పారిస్తా అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన బాధ్యతేనా..? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. నీళ్లు కావాలని మేం అడిగితే రక్తం కావాలె అని రేవంత్ రెడ్డి అడుగుతున్నడు. సరే నీకు రక్తం కావాలంటే కూడా ఇస్తం.. మేమేం వెనుకాడేటోళ్లం కాదు.. నీకు నీళ్లివ్వడానికి అడ్డమైతే మేం రక్తం ఇవ్వడానికి కూడా మేం సిద్దంగా ఉన్నామన్నారు. సీఎం రేవంత్ భాష శాడిస్ట్ మాట్లాడే భాషలా ఉన్నాయన్నారు.
సీఎం మాటలు వింటే ఆయనలో ఒక సైకో కనిపిస్తున్నారు. పొలాల్లో నీళ్లు పారించమంటే బూతులు పారిస్తున్నారు. నిన్న బోధి పెవీలియన్‌లో మాట్లాడిండు.. పేరేమో బోధి పెవీలియన్.. మాటలేమో హింసను ప్రేరేపించి హింసను తలపించే మాటలు నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిండు. ఆ మధ్య హిట్లర్ తనకు ఆదర్శం అన్నాడు. అందుకే హిట్లర్ తరహాలు ఒక హంతక భాష మాట్లాడుతున్నడు. కానీ ఒకటి మాత్రం నిజం.. ఫైనల్‌గా పాపం పండిన్నాడు హిట్లర్‌కు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడ్తదని హెచ్చరించారు. .
ఇలాంటి భాష ఎవడు మాట్లాడుతడు.. ఫ్రస్టేషన్ ఉన్నవాడు. విషయం లేనటువంటి వాడు.. సమాధానం చెప్పలేనట్వంటి వాడు.. సమాధానం ఉంటే, విషయముంటే, పరిజ్ఞానం ఉంటే సత్తా ఉంటే విషయం మీద మాట్లాడుతడు.. నువ్వు జారుడు బండ మీద జారిపోతున్నవ్. నీకు ఓటమి తప్పదు అని ఫ్రస్టేషన్లో ఊగిపోతున్నవ్. బూతు భాష మాట్లాడుతున్నవ్. నిజంగా విషయముంటే ఒప్పిస్తవ్.. మెప్పిస్తవ్. విషయం లేదు కనుకనే బూతులను అందుకుంటున్నవ్ అని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. సీఎం మాటలు విన్న తర్వాత షాబాద్‌లో ముగ్గురు పసిపిల్లలను, ముగ్గురు పెద్దవాళ్లను ఆరుగురిని గొంతు కోసి కిరాతకంగా హత్య చేసిన ఆ రాజ్ కుమార్‌కు రేవంత్ రెడ్డికి మధ్య పెద్ద తేడా కనిపించడం లేదన్నారు హరీశ్ రావు.
Live: తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మీడియా సమావేశంhttps://t.co/qNI2aApmmJ
— BRS Party (@BRSparty) July 12, 2026