Patnam Narender Reddy | సీఎం రేవంత్ రెడ్డి విజయోత్సవాల మొదటి సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. కొడంగల్, నారాయణ్ పేట లిఫ్ట్‌కు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శంకు స్థాపన చేశారు. నిన్న మక్తల్‌లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరోసారి సీఎం శంకుస్థాపన చేశారన్నారు. ఓకే ప్రాజెక్టుకు సీఎం రెండు సార్లు శంకు స్థాపన చేస్తారా ? అని ప్రశ్నించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. హామీలు అమలు చేయలేదు కనుకే సీఎం సభకు జనాలు రాలేదన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని సీఎం పూర్తి చేయడం లేదు. కమీషన్ల కోసమే కొడంగల్ లిఫ్టు పథకాన్ని ముందుకు తెచ్చారు.. సీఎం, ఆయన సోదరులు కమీషన్ల కక్కుర్తిలో మునిగిపోయారు. కేసీఆర్ ఫార్మా సిటీకి సేకరించిన 14 వేల ఎకరాలను వాడుకుని ఫ్యూచర్ సిటీ అని మభ్యపెడుతున్నారన్నారు.
ఎన్నికలప్పుడు ఫార్మా భూములను రైతులకు తిరిగి ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చి మాట తప్పారు. ఫ్యూచర్ సిటీని నార్త్ ఇండియా సినీ యాక్టర్లకు అప్పజెబుతున్నారు. రామోజీ ఫిలిం సిటీ ఉండగా ఇంకా వేరే ఫిలిం సిటీలు ఎందుకు? అని ప్రశ్నించారు. కేసీఆర్ కృషి వల్లే కోకాపేటలో ఎకరాకు రూ.150 కోట్ల ధర పలుకుతోంది. కేసీఆర్ వేసిన వెంచర్లలో ప్లాట్లు అమ్ముకుని రేవంత్ బతుకుతున్నాడు. రేవంత్‌కు దమ్ముంటే ఫ్యూచర్ సిటీలో వెంచర్ వేసి కోకాపేట రేటు తెప్పించగలరా ?
అని పట్నం నరేందర్ రెడ్డి ప్రశ్నించారు.
Sanchar Sathi App: సంచార్ సాథీ యాప్‌ను డిలీట్ చేసుకోవచ్చు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి సింథియా