బంజారాహిల్స్,నవంబర్ 21: గతంలో ఉన్న పరిచయాన్ని అడ్డుగా పెట్టుకుని యువతిని వెంటపడి వేధిస్తుండడంతో(Woman harassment) పాటు ఆఫీసుకు వచ్చి అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్‌లోని ఓ చానెల్లో యాంకర్‌గా పనిచేస్తున్న యువతి(30)కి, హరీశ్ అనే వ్యక్తితో ఐదేళ్లుగా పరిచయం ఉంది. వారిద్దరూ గతంలో ప్రేమించుకున్నారు. అయితే ఏడాది క్రితం హరీశ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో బాధిత యువతి అతడిని దూరం పెట్టింది. కాగా, గత కొన్ని రోజులుగా హరీశ్ బాధిత యువతికి ఫోన్లు చేస్తుండడంతో పాటు వెంటపడి వేధిస్తున్నాడు.
తనతో మాట్లాడవద్దని యువతి చెప్పినా వినిపించుకోకుండా మూడురోజుల క్రితం నేరుగా ఆమె పనిచేస్తున్న ఆఫీసువద్దకు వచ్చాడు. మద్యం మత్తులో తీవ్ర పదజాలంతో ఆమెను అసభ్యకరంగా దూషించాడు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఫోన్లు చేస్తున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్ 78(2), 74,79 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Junior Lecturers | జూనియర్ లెక్చరర్స్ ఇంగ్లీష్, మ్యాథ్స్ అభ్యర్థుల తుది జాబితా విడుదల
Harish Rao | ఇవి కూడా ఆయన ఖాతాలోనే వేసుకుంటారేమో..! రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు సెటైర్లు
MLC Kavitha | అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా..? ఎమ్మెల్సీ కవిత ట్వీట్