MLC Shambhipur Raju | దుండిగల్, ఫిబ్రవరి 9 : ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన వివిధ వర్గాల ప్రజలు, సంక్షేమ సంఘాల నేతలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును ఆదివారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తమ తమ ప్రాంతాలలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్సీకి వివరించడంతోపాటు పరిష్కరించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
MLA Vivekananda | రాజయోగ ధ్యానంతో ఒత్తిడి దూరం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Chilkur Balaji Temple | చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడిపై దుండగుల దాడి
Soil Mafia | కందుకూరులో యథేచ్ఛగా మట్టి మాఫియా.. రాత్రయ్యిందంటే వందల టిప్పర్లు రోడ్డుపైకి!