MLA Vivekananda | దుండిగల్, ఫిబ్రవరి 9: రాజయోగ ధ్యానంతో మనసు ప్రశాంతంగా ఉంటుందని, తద్వారా శారీరక మానసిక ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం ఉందని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్లోని ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజయోగ మెడిటేషన్ సెంటర్ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేపీ వివేకానంద మాట్లాడుతూ.. సమాజంలో నీతి, శాంతి, సామరస్యాన్ని నెలకొల్పడంలో బ్రహ్మకుమారీస్ చేస్తున్న కృషి అభినందనీయమదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారీలతోపాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Chilkur Balaji Temple | చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడిపై దుండగుల దాడి
Soil Mafia | కందుకూరులో యథేచ్ఛగా మట్టి మాఫియా.. రాత్రయ్యిందంటే వందల టిప్పర్లు రోడ్డుపైకి!