Chilkur Balaji Temple | మొయినాబాద్, ఫిబ్రవరి 09: చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అడ్డొచ్చిన ఆయన కుమారుడిని గాయపరిచారు. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు బాలజీ ఆలయం సమీపంలోని రంగరాజన్ నివాసానికి శుక్రవారం నాడు పలువురు వ్యక్తులు వచ్చారు. రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు రంగరాజన్ నిరాకరించారు. రామరాజ్యం పేరుతో వచ్చిన వ్యక్తుల మాట నిరాకరించినందుకు తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని.. తనపైనా దాడి చేశారు.
ఈ దాడికి పాల్పడిన వారితో పాటు పరోక్షంగా వారికి సహకరించిన వ్యక్తులను కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు