Harish Rao | హైదరాబాద్ : జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని అడిగితే అరెస్టులు చేస్తారా? అని కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డారు.
రాష్ట్రానికి గుండె కాయ లాంటి హైదరాబాద్ నగరాన్ని నిర్లక్ష్యం చేస్తున్న మీ వైఖరిని నిలదీస్తే మార్షల్స్‌తో కార్పొరేటర్లను బడ్జెట్ కౌన్సిల్ నుంచి బయటికి పంపిస్తారా? అని రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ మీద ఎలాంటి చర్చ లేకుండానే అమోదిస్తున్నట్లు ప్రకటించడం అప్రజాస్వామికం. మీ నిరంకుశ వైఖరికి ఇది మరో నిదర్శనం. ప్రజల తరుపున ప్రశ్నించే ప్రజాప్రతినిధుల గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం.
హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని అడిగితే అరెస్టులు చేస్తారా?
రాష్ట్రానికి గుండె కాయ లాంటి హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేస్తున్న మీ వైఖరిని నిలదీస్తే మార్షల్స్ తో కార్పొరేటర్లను బడ్జెట్ కౌన్సిల్… pic.twitter.com/JJLdaUPgac
— Harish Rao Thanneeru (@BRSHarish) January 30, 2025
ఇవి కూడా చదవండి..
KTR | బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గం : కేటీఆర్
GHMC | జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత.. చర్చ లేకుండానే బడ్జెట్‌కు ఆమోదం
Electricity Meters | కాలిపోతున్నాయ్.. గ్రేటర్లో ప్రశ్నార్థకంగా విద్యుత్ మీటర్ల పనితీరు!