హైదరాబాద్ : వర్షం నీటిలో పడి ఆరిఫ్ మన్సూర్(13 నెలల) అనే చిన్నారి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..బిహార్ రాష్ట్రానికి చెందిన మీర్ అహ్మద్, రోఫన్ దంపతులు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో(Shadnagar) నివసిస్తున్నారు. వారి కుమారుడైన ఆరిఫ్ పిల్లలతో కలిసి వర్షం నీటిలో(Rain water) గంతులు వేస్తూ ఆడుకుంటుండగా నీటి గుంతలో పడి చనిపోయాడు(Boy dies). గమనించిన తండ్రి ఆరిఫ్‌ను ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే చిన్నారి ఆరిఫ్ మృత్యువాత పడ్డాడు.
కాగా, కండ్లముందే అప్పటి వరకు తమ ముందు ఆడుకున్న కొడుకు అంతలోనే శవంగా మారడంతో తల్లి దండ్రుల రోదనలు మిన్నంటాయి. మీర్ అహ్మద్ షాద్‌నగర్‌లోని నోబుల్ పార్క్‌లో వాచ్ మెన్‌గా పనిచేస్తు న్నాడు. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.