సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం హైదరాబాద్ సిటీ పోలీస్ సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన పూజ కార్యక్రమాలలో సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) పాల్గొని ఆయుధ(Ayudha Puja), వాహనాలకు పూజలు నిర్వహించారు. అనంతరం కార్ హెడ్ క్వార్టర్స్‌లో నూతనంగా నిర్మించిన పోలీస్ సబ్సిడరీ క్వాంటీన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్దలతో జరుపుకోవాలన్నారు.
ఆయుధ పూజ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దుర్గామాత ఆశీస్సులతో అందరు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా విధులు నిర్వహించాలని సిబ్బందిని, అధికారులను కోరుతూ సిటీ పోలీసులకు దసరా శుభకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు రక్షిత కృష్ణమూర్తి, రాహుల్ హెగ్డే, స్నేహ మేర, శ్వేత, పాటిల్ కాంతిలాల్ తదితరులు పాల్గొన్నారు.