One Nation, One Election | ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రణాళికను రద్దు చేయండి.. కేరళ అసెంబ్లీ తీర్మానం
One Nation, One Election | దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రణాళికను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేరళ కోరింది. ఈ ప్రతిపాదన అప్రజాస్వామ్యమని ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కేరళ అసెంబ్లీ ఈ మేరకు గురువారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
తిరువనంతపురం: దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ (One Nation, One Election) ప్రణాళికను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేరళ కోరింది. ఈ ప్రతిపాదన అప్రజాస్వామ్యమని ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. కేరళ అసెంబ్లీ ఈ మేరకు గురువారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కేరళ సీఎం పినరయి విజయన్ తరపున ఆ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎంబీ రాజేష్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదన దేశంలోని సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ‘ఈ ప్రతిపాదన అప్రజాస్వామికం. దేశంలోని సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వైవిధ్యాలను దెబ్బతీసే ప్రయత్నం. ఖర్చులను తగ్గించడానికి, సులభతరమైన పాలనను నిర్ధారించడానికి సులభమైన మార్గాలున్నాయి. రాజ్యాంగంలోని ప్రధానమైన సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేయడం, ప్రజల హక్కులను సవాలు చేయడం, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక స్వపరిపాలన హక్కులను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన ఉంది’ అని అన్నారు.
కాగా, ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదన అధికార కేంద్రీకరణకు దారితీస్తుందని మంత్రి ఎంబీ రాజేష్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కేంద్రీకృత, ఏకీకృత పరిపాలనా వ్యవస్థను అమలు చేయడానికి బీజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఎజెండాలో ఇది ఒక భాగమని ఆయన ఆరోపించారు. మరోవైపు కేరళ అసెంబ్లీలో బీజేపీకి ఒక్క శాసనసభ్యులైనా లేరు. అలాగే ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన మొదటి రాష్ట్ర అసెంబ్లీగా కేరళ నిలిచింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

