కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 10 : కాలనీలు, బస్తీలలోని ఖాళీ ప్రదేశాలను అహ్లదకరమైన పార్కులుగా తీర్చిదిద్దామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం బాలాజీనగర్ కాలనీలో ఫ్రీడమ్ అయిల్ సంస్థ సహకారంతో అభివృద్ధి చేస్తున్న పార్కు పనులను ఎమ్మెల్యే కృష్ణారావు, ఫ్రీడం అయిల్ సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీలో ప్రజల అవసరాల కోసం ఆహ్లాదకరమైన పార్కులుగా తీర్చిదిద్దుతున్నామని, పనులు పూర్తి కాగానే ప్రారంభిస్తామని చెప్పారు.
ఆయా కాలనీలలోని ఖాళీ ప్రదేశాలను పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. బాలాజీనగర్ కాలనీలో ప్రజల కోసం పార్కును అభివృద్ధి చేసిన ఫ్రీడం అయిల్ సంస్థను అభినందించాడు. ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో డీఈ శ్రీదేవి, ఏఈ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, స్థానిక నేతలు ప్రభాకర్‌గౌడ్, వెంకట్రావు, యెట్టయ్య, అంజిరెడ్డి, ప్రభు, సుభాష్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, ఆరోగ్యరెడ్డి, రమణ, తిమ్మారెడ్డి, బొట్టు విష్ణు, ఉదయ్ తదితరులు ఉన్నారు.