వెంగళరావునగర్, జనవరి 9 : ఇంటి వద్ద పార్క్ చేసిన ఆటో చోరీకి(Auto stolen) గురైన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎల్లారెడ్డిగూడలోని(Yellareddyguda) ఆర్బీఐ క్వార్టర్స్ సమీపంలో జి.లక్ష్మీ తులసి(40) అనే మహిళ ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నది. ఎప్పటిలాగే ఫుడ్ క్యాటరింగ్ కోసం ఉపయోగించే తమ ట్రాలీ ఆటోని ఈ నెల 6వ తేదీ రాత్రి ఇంటి ముందు పార్క్ చేశారు. మరుసటి రోజు ఉదయం ఇంటి ముందు పార్క్ చేసిన ఆటో కనిపించకుండా పొయింది. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో బుధవారం రాత్రి మధురానగర్ పోలీసు స్టేషన్లో లక్ష్మీతులసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | జులై 6 లోగా పాస్‌పోర్టు తిరిగి అప్పగించండి.. సీఎం రేవంత్‌కు ఏసీబీ కోర్టు ఆదేశం
RS Praveen Kumar | కేటీఆర్ గారూ.. సత్యం మీ వైపే ఉంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్