KTR | గన్‌పార్క్ వద్ద కేటీఆర్‌ను కలిసిన ఆశావర్కర్లు.. అండగా ఉంటామని హామీ
KTR | ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం శాంతియుతంగా తలపెట్టిన ‘చలో హైదరాబాద్' కార్యక్రమం చేపట్టగా ప్రభుత్వం పోలీసులతో వారిపై ఉక్కుపాదం మోపింది.
KTR | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ కంపెనీ అక్రమాలకు పాల్పడిందని, రాఘవ కన్స్ట్రక్షన్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని.. మంత్రి అక్రమ మైనింగ్ కంపెనీపై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ క్రషర్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ నిరసన తెలిపారు. ఈ నిరసనలో కేటీఆర్, హరీశ్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆశా వర్కర్లు గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. తాము చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారికి అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం శాంతియుతంగా తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం చేపట్టగా ప్రభుత్వం పోలీసులతో వారిపై ఉక్కుపాదం మోపింది.
అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఇచ్చిన రూ. 18 వేల కనీస వేతనం హామీని నెరవేర్చాలని, నెలల తరబడి బకాయిలను వెంటనే రిలీజ్ చేయడంతోపాటు తమకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలో భాగంగా వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన ఆశా కార్యకర్తలను పోలీసులు శనివారం ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్టు చేశారు. ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది.
గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని కలిసిన ఆశా వర్కర్లు
తమ ఇబ్బందులను కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చిన ఆశాలు
వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన కేటీఆర్ https://t.co/VsVRG3CEJv pic.twitter.com/8KnbJw70pp
— Telugu Scribe (@TeluguScribe) March 29, 2026
Read Also :
Chennur | చెన్నూరులో దారుణం..టీచర్ల వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య?
Pakistani ships | ‘హర్మూజ్’ గుండా 20 పాక్ నౌకలకు అనుమతి.. శాంతికి సంకేతమన్న పాకిస్థాన్
Anakapalli Teaser | త్రిణాధరావు నక్కిన మార్క్ స్టోరీతో ‘అనకాపల్లి’.. ఆకట్టుకుంటున్న టీజర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- asha workers
- gunpark
- Hyderabad
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

