Unemployee | ఇక యుద్ధం మొదలు.. నొటిఫికేషన్ ఎక్కడ..? ఉద్యోగాలు ఎక్కడ..? ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డితోపాటు పలువురు నేతలు, నిరుద్యోగ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఓ నిరుద్యోగి మాట్లాడుతూ.. 2023 ఎన్నికల సమయంలో ప్రవళిక అనే యువతి చనిపోతే చాలా గోల చేసి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ప్రియాంకా గాంధీ పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టారు. కానీ మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. కనీసం మీరు ఒక్కరైనా.. ఒక్క వార్డు మెంబరైనా వాళ్ల ఇంటికెళ్లి పరామర్శించారా..? పరామర్శించరు.. ఎందుకంటే మీకొక్కటే తెలుసు. దాచుకోవడం, దోచుకోవడం, నింపుకోవడమే వారి లక్ష్యమని మండిపడ్డాడు.
కాంగ్రెస్ నాయకులకు రాబోయే ఎన్నికల్లో మనం ఎట్లా గెలవాలి.. ఎట్లా ముందుకు పోవాలనేదే ఉంది.. సిగ్గుందా.. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటూ ఫైర్ అయ్యాడు.
2023 ఎన్నికల సమయంలో ప్రవళిక అనే యువతి చనిపోతే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ పోస్టర్లు పెట్టి గోల గోల చేశారు
అదే మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 మంది నిరుద్యోగులు చనిపోతే ఒక్కరు కూడా వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించలేదు
– నిరుద్యోగి https://t.co/6C9ioZIMng pic.twitter.com/DMonAG5p3a
— Telugu Scribe (@TeluguScribe) June 4, 2026
Ameerpet Fire Accident | అమీర్పేట్లో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్ మాల్లో ఎగసిపడుతున్న మంటలు
Chiranjeevi | ‘పెద్ది’ విజయంపై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్.. చరణ్ కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది..
‘వార్డు సభల్లో ప్రజలు భాగస్వాములు కావాలి’