Sonam Wangchuk: ఆమరణ దీక్షకు బ్రేక్.. సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించిన పోలీసులు
Sonam Wangchuk : సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ దీక్షకు బ్రేక్ పడింది. ఢిల్లీ పోలీసులు ఇవాళ ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ధర్నా ప్రాంతం నుంచి తరలించారు. నీట్ పరీక్ష లీకేజీల నేపథ్యంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్(Sonam Wangchuk)ను ఇవాళ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన 20 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం శనివారం ఉదయం ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమీషనర్ సచిన్ శర్మ తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. వైద్య నిపుణుల ప్రకారం వాంగ్చుక్కు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో కొందరు అడ్డుపడ్డారు. ఆ సమయంలో స్వల్ప తోపులాట జరిగింది. కానీ చాలా సంయమనంతో పోలీసులు ఆ ఆపరేషన్ నిర్వహించారు. విజయవంతంగా వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించారు.
నిరసన ప్రదర్శన చేస్తున్న ప్రాంతాన్ని ఆందోళనకారులు విడిచి వెళ్లాలని పోలీసులు విజ్ఞాప్తి చేశారు. సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించిన తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మాట్లాడారు. నిరసనకారులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, తనను కొట్టి, నిర్బంధించారని ఆయన తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. జూన్ 28వ తేదీ నుంచి వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష చేస్తున్నారు. నీట్ పరీక్షలో లీకేజీలు జరిగాయని, దీనికి బాధ్యులైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఆ నిరసనలో భాగంగా వాంగ్‌చుక్ ఆమరణ దీక్షతో మద్దతు తెలిపారు. ఆమరణ దీక్ష వల్ల వాంగ్‌చుక్ సుమారు 9.5 కేజీల బరువు కోల్పోయినట్లు డాక్టర్లు చెప్పారు. బీపీ, షుగర్‌ను మానిటర్ చేస్తున్నట్లు తెలిపారు.
శుక్రవారం వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. ఈ నెల 20న కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే పార్లమెంట్ మార్చ్ వరకు తాను ప్రాణాలతోనే ఉంటానని చెప్పారు. అది సాధ్యం కాకపోతే ఆత్మగానైనా తిరిగి వస్తానని చెప్పారు. ‘బయటకు నేను బలహీనంగా ఉన్నాను కాని లోపల ఎంతో బలంగా ఉన్నాను. మీరంతా బయట, లోపల బలంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మనకు ఈ శక్తి ఈ నెల 20 వరకు కావాలి’ అని అన్నారు.
#WATCH | Delhi: The police took activist Sonam Wangchuk, who had been on a hunger strike at Jantar Mantar for the past 20 days, to the hospital
DCP New Delhi tweeted, “As per orders of Hon’ble High Court and on expert medical advise due to the deteriorating health condition of… pic.twitter.com/o8HxPSzu0f
— ANI (@ANI) July 18, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

