శ్రీహరికోట: హైదరాబాదీ అంకుర సంస్థ స్కైరూల్ ఏరోస్పేస్ సంస్థ బృందానికి ప్రధాని మోదీ(PM Modi) బెస్ట్ విషెస్ తెలిపారు. విక్రమ్1 రాకెట్ ప్రయోగం వల్ల చరిత్ర సృష్టించాలని, రాబోయే ఆవిష్కర్తలకు ప్రేరణగా నిలవాలన్నారు. స్కైరూట్ సంస్థ రూపొందించిన విక్రమ్1 రాకెట్‌ను ఇవాళ శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. ఉదయం 11.30 నిమిషాలకు ఆ రాకెట్ నింగికి ఎగరనున్నది. భారతీయ అంతరిక్ష ప్రయాణంలో ఇది చరిత్రాత్మక కొత్త అధ్యాయం కాబోనున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. తన ఎక్స్ అకౌంట్లో ఆయన స్పందిస్తూ.. భారత్ డెవలప్ చేసిన తొలి ప్రైవేటు అంతరిక్ష నౌక అని ఆయన తెలిపారు. నాలుగు దశల రాకెట్‌ను డిజైన్ చేశారన్నారు. యువతలోని స్పూర్తి, పట్టుదల, ట్యాలెంట్‌కు ఈ మిషన్ సాక్షిగా నిలుస్తుందన్నారు. దేశ అంతరిక్ష రంగం యువతకు అవకాశాలు కల్పిస్తోందని, ఈ కొత్త ప్రాజెక్టు ఆ కోవకే చెందుతుందన్నారు. విక్రమ్ పరీక్ష సక్సెస్ కావాలని స్కైరూట్ ఏరోస్పేస్ బృందానికి ఆయన బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ చరిత్రాత్మక మిషన్‌ను యువత ఫాలోకావాలని ఆయన సూచించారు.
A historic new frontier for India’s space journey!
At 11:30 AM today, Skyroot Aerospace will undertake the maiden orbital launch of Vikram-1, India’s first privately developed launch vehicle.
This four-stage rocket is designed to provide rapid and on-demand launch services.… pic.twitter.com/1qFVTwNOuZ
— Narendra Modi (@narendramodi) July 18, 2026
విక్రమ్-1 అనేది పూర్తిగా నాలుగు దశల ఆర్బిటల్ లాంచ్ వెహికల్. మొదటి మూడు దశలు సాలిడ్ ప్రొపల్షన్‌ను ఉపయోగిస్తాయి. నాలుగో దశ ఆర్బిటల్ ఇన్సర్షన్, ప్రిసిషన్ విన్యాసాల కోసం లిక్విడ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. 350 కిలోల వరకు బరువు ఉన్న చిన్న ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్‌కి తీసుకెళ్లడానికి దీనిని నిర్మించారు. దీని మొదటి టెస్ట్ ఫ్లైట్ 60 డిగ్రీల వాలులో 450 కిలోమీటర్ల కక్ష్యను చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. విక్రమ్-1 భారతీయ ఎర్త్ అబ్జర్వేషన్ నానోశాటిలైట్ మేకర్ గ్రహ స్పేస్, తదితర సంస్థల నుంచి బహుళ సాంకేతిక ప్రదర్శన పేలోడ్లను తీసుకెళ్లనుంది.