Namita | గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్ నమిత.. స్లిమ్ లుక్ చూసి షాక్ అవుతున్న అభిమానులు!
Namita | ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నమిత ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ జీవితంలో బిజీగా గడుపుతున్న ఆమె.. తాజాగా తన ఫిట్నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.
Namita | ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నమిత ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ జీవితంలో బిజీగా గడుపుతున్న ఆమె.. తాజాగా తన ఫిట్నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.ఒకప్పుడు బొద్దుగా కనిపించిన నమిత.. ఇప్పుడు పూర్తిగా స్లిమ్‌గా మారి అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. జిమ్‌లో కఠినంగా వర్కౌట్స్ చేస్తున్న వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. మీ మనసు ఏదైతే నమ్ముతుందో.. మీ శరీరం దానినే అనుసరిస్తుంది అనే సందేశాన్ని కూడా ఆ వీడియోకు జత చేశారు.
ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్లు వరుసగా కామెంట్లు చేస్తున్నారు. ఇంత స్లిమ్‌గా మారారు ఏంటి?, నిజంగా ఇది నమితేనా?, స్టైలిష్ లుక్ అదిరిపోయింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా మంది ఆమె కొత్త లుక్‌ను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నమిత సినీ ప్రయాణాన్ని పరిశీలిస్తే.. కన్నడ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ‘సొంతం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ‘ఒక రాజు ఒక రాణి’, ‘ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి’, ‘బిల్లా’, ‘నాయకుడు’, ‘సింహా’, ‘మన్యం పులి’ వంటి చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన ‘సింహా’ సినిమాలో ఆమె గ్లామర్, నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
పెళ్లి అనంతరం సినిమాలకు విరామం ఇచ్చిన నమిత గత కొన్నేళ్లుగా పూర్తిగా కుటుంబ జీవితానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే తాజాగా ఆమె ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి సరికొత్త లుక్‌లో కనిపించడంతో.. త్వరలోనే మళ్లీ వెండితెరపై రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే చర్చ సినీ వర్గాల్లో మొదలైంది. అయితే దీనిపై నమిత నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

