మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. దమ్మాయిగూడలో వేగంగా వచ్చిన ఓ లారీ ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోపియాన్ అనే ఏడో తరగతి విద్యార్థి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు.