ఆంధ్ర జలదోపిడీని అడ్డుకోవడంలో.. ప్రభుత్వం విఫలం
‘శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమకు అక్రమంగా నీటిని తరలించుకుపోతోంది. ఆంధ్ర జలదోపిడీని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు.
- రైతులను తప్పుదారి పట్టించడానికే వరుణయాగం
- పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీటిని తీసుకుపోతున్నా స్పందించని సీఎం
- మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్
హాలియా, ఆగస్టు 12 : ‘శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమకు అక్రమంగా నీటిని తరలించుకుపోతోంది. ఆంధ్ర జలదోపిడీని అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. గురువారం హాలియాలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి నిండినా నాగార్జున సాగర్‌కు నీటిని తీసుకురావడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగులు జలాలను ఉపయోగించుకోవాలే తప్ప శ్రీశైలం ప్రాజెక్టులోని మిగులు జలాలను ఉపయోగించుకునే హక్కు వారికి లేదన్నారు.
గత పది రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుంచి 6 టీఎంసీల నీటిని అక్రమంగా రాయలసీమకు తరలించుకుపోతున్నా తెలంగాణ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రైతులను తప్పుదారి పట్టించేందుకే వరుణయాగం చేశారని విమర్శించారు. కృష్ణ, గోదావరి నదుల నీటిని సక్రమంగా ఉపయోగించుకోవడం లేదన్నారు, ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి, ఈ ప్రాంత రైతుల సంక్షేమంపై జిల్లా మంత్రులకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కురాకుల వెంకటేశ్వర్లు, వడ్డే సతీశ్‌రెడ్డి, వర్రా వెంకట్‌రెడ్డి, నల్లగొండ సుధాకర్, పిడిగం నాగయ్య, కడమంచి శ్రీనివాస్, చేగొండి కృష్ణ, సురభి రాంబాబు, యడవల్లి నాగారాజు, చిట్టిపోలు శ్రీనివాస్, కురాకుల రవి, సైదాచారి, పిల్లి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

