మేడ్చల్ కలెక్టరేట్, ఆగస్టు 13 : తాగునీరు ఇవ్వండి సారూ అంటూ.. మేడ్చల్ జిల్లా నాగారంలోని బాలాజీనగర్ కాలనీవాసులు రోడ్డెక్కారు. గురువారం ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
4 నెలలుగా తాగునీరు రాక అనేక ఇబ్బందులు పడుతున్నామని, పలుమార్లు అధికారులకు వినతిపత్రం అందించినా పట్టించుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఘట్కేసర్ సర్కిల్ డీసీ వాణిరెడ్డి, జలమండలి అధికారులు స్పందించి తాగునీటి సరఫరా చేయాలని కోరారు.