KTR | ఆమనగల్ మున్సిపల్ పీఠం గెలిచి ఓడిపోయినమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆమనగల్ మున్సిపల్ పీఠం ఓటమి విషయంలో ఎవరి పేరు నేను చెప్ప కానీ మన నాయకుల అనైక్యత వల్లే ఓడిపోయినం అండ్ల అనుమానం ఏం లేదు.. ఇందులో సిగ్గుపడేది ఏం లేదన్నారు.
మనం 17 సీట్లలో 8 గెలిచాం. కాంగ్రెసోడు గడ్డపార లెక్క ఒక్కటే గెలిచిండు. బీజీపోడు నాలుగో.. ఐదో గెలిచిండు. అంటే ఆరు. మరి మెజారిటీ మనం గెలిస్తే మున్సిపాలిటీ ఎట్లాపోతదన్నారు. మనవాళ్ల ఉద్దేశపూర్వకంగానే పోగొట్టిర్రు. మోసం జరిగింది.. పక్కా మనవాళ్లే చేసిర్రని వ్యాఖ్యానించారు.
ఆమనగల్ మున్సిపల్ పీఠం మన నాయకుల వెన్నుపోటు వల్లే చేజారిపోయింది
మెజారిటీ సీట్లు గెలిచి కూడా ఓడిపోయామంటే, మన నాయకులే ఉద్దేశపూర్వకంగా ఓడగొట్టారు – కేటీఆర్ pic.twitter.com/kU0hmn3ohr
— Telugu Scribe (@TeluguScribe) April 29, 2026