SIR | హైదరాబాద్, జూలై 07: సర్ కార్యక్రమంలో భాగంగా అడిషనల్ సీఈవో వాసం వెంకటేశ్వర్లు రెడ్డి (ఐఏఎస్) మంగళవారం మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి, మీర్ పేట్, ఎల్.బి.నగర్ నియోజకవర్గంలోని సరూర్ నగర్ ప్రాంతాలలో పర్యటించి ‘సర్’ ప్రక్రియ పురోగతిని పరిశీలించారు.
సర్ కార్యక్రమంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని బీఎల్వో (BLO)లను, సూపర్వైజర్లను ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారం నింపడంలో సూపర్వైజర్లు ముఖ్య పాత్ర పోషించాలన్నారు. ఫారాలు నింపడంలో బీఎల్వోలకు సహకరించాలన్నారు. అవసరమైన చోట్ల వాలంటీర్ల సేవలను వాడుకొని ఎన్యుమరేషన్ ఫారాలు తప్పులు లేకుండా నింపడంలో ఓటర్లకు సహకరించాలని సూపర్వైజర్లు, బీఎల్వోలను ఆదేశించారు.
ఎన్యూమరేషన్ ఫారంలో ఓటరు సంతకంతోపాటు ఫోటో ఉండేలా చూడాలని బీఎల్వోలను ఆదేశించారు. పర్యటనలో భాగంగా వాసం వెంకటేశ్వర్లు రెడ్డి జల్పల్లిలో 32 చోట్ల రోహింగ్యాలు నివసిస్తున్న ప్రాంతాలను పర్యటించి వారిని గుర్తించారు. ఈ పర్యటనలో ERO, BLO లు తదితరులు పాల్గొన్నారు.


