ACB Raids | అవినీతి నిరోధక శాఖ అధికారులు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆర్అండ్బీ (రోడ్లు భవనాల శాఖ) ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) మోహన్ నాయక్ ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.
మియాపూర్ పరిసర ప్రాంతాల్లోని 11 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన టెండర్లలో కాంట్రాక్టర్లకు టెండర్లు కేటాయించే ప్రక్రియలో అక్రమాలు చేసినట్టుగా మోహన్ నాయక్‌పై గతంలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీలకు సంబంధించి మరిన్ని వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
Dubai | దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన ముగ్గురు కార్మికులు మృతి
Ramchander Rao | ప్రాజెక్టులు సీఎం రేవంత్‌రెడ్డికి ఏటీఎంలుగా మారాయి : రాంచందర్ రావు