Tank Bund | హైదరాబాద్ : ఓ మహిళ ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, ట్యాంక్ బండ్ శివ కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే ట్యాంక్ బండ్ శివ హుస్సేన్ సాగర్‌లోకి దూకి మహిళను బయటకు తీసుకొచ్చారు.
ఆమె ప్రాణాలతో ఉండడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.
ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళ
హైదరాబాద్ – ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్యకు యత్నించిన మహిళ.. గమనించిన స్థానికులు, పోలీసులు.. ట్యాంక్ బండ్ శివ సహాయంతో ఆమెను బయటకుతీసుకొచ్చారు.
హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్య ప్రయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. pic.twitter.com/XDU1NEFZvP
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2024
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొన్నందుకు సంతోషం: కేటీఆర్
CV Anand | ఏసీబీ నుంచి తప్పించుకోలేరు.. అధికారులకు ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ హెచ్చరిక