KTR | రాష్ట్రంలో గురుకులాల పనితీరు, పరిశుభ్రతపై పార్టీ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటనతో ప్రభుత్వంలో చలనం వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ హాస్టళ్ల (Govt Hostels ) బాటపట్టింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల హాస్టల్కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందిస్తూ.. గురుకుల స్కూళ్ల సమస్యలపై మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.
8నెలల్లో కలుషిత ఆహారంతో 500 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. నిన్న బీబీపేట పాఠశాలలో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన భోజన వసతి కల్పించాలి. పాఠశాలల్లో వసతులు, సమస్యలను పరిష్కరించాలని కేటీఆర్ కోరారు. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1000కు పైగా గురుకులాల్లో ప్రాణనష్టం జరగకుండా.. ఆహార నాణ్యతను మెరుగుపరిచేందుకు డిప్యూటీ సీఎం, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Glad we have been able to push the Congress Govt out of its deep slumber that all is well in Gurukul hostels
Hope the Deputy CM & Govt will take all necessary steps to prevent loss of life and improve quality of food being served across 1000 plus Gurukuls established by KCR… https://t.co/w334cFibkN
— KTR (@KTRBRS) August 13, 2024