కాచిగూడ,జూలై 29 : పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్(Kachiguda) పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప వివరాల ప్రకారం.. గుర్తుతెలియని వ్యక్తి(45)ఆదివారం రాత్రి ఫలక్నామ-ఉందానగర్ రైల్వేస్టేషన్ల మద్య పట్టాలు దాటుతుండగా అదే సమయంలో ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో(Train accident) ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుని ఒంటిపై పసుపుపచ్చ రంగు చొక్క, నలుపు రంగు ప్యాంట్ ధరించి, ఎత్తు 5.4 ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Crop Loans | రేపు రెండో విడుత రుణమాఫీ ప్రారంభం.. ఈ సారైనా అర్హులందరికీ మాఫీ అయ్యేనా..?