హైదరాబాద్ : ప్రైవేట్ ట్రావెల్ బస్సు(Private travel bus) ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జీడిమెట్ల (Jeedimetla)పరిధి షాపూర్‌నగర్ చౌరస్తాలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రహదారి దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పాదచారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.