మెదక్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ) : ప్రభుత్వం గురువారం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేయగా, మెదక్ జిల్లా కలెక్టర్‌గా ప్రతిమా సింగ్‌ను నియమించింది. గురువారం మెదక్ కలెక్టరేట్లో ప్రతిమాసింగ్ బాధ్యతలు స్వీకరించారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న ప్రతిమాసింగ్‌ను ప్రభుత్వం మెదక్ కలెక్టర్‌గా బదిలీ చేసింది. మెదక్ కలెక్టర్‌గా పనిచేసిన రాహుల్ రాజ్‌ను రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ కో ఆపరేటివ్ సహకార రిజిస్ట్రేషన్ శాఖకు బదిలీ చేసింది.
రాహుల్‌రాజ్ మెదక్ కలెక్టర్‌గా 2024 మార్చి 5న బాధ్యతలు స్వీకరించారు. నిత్యం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ అధికార యంత్రాంగాన్ని రాహుల్‌రాజ్ ఉరుకెత్తించారు. ప్రతిమాసింగ్ గతంలో మెదక్ అదనపు కలెక్టర్‌గా పనిచేశారు. నూతన కలెక్టర్‌కు గురువారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్వో భుజంగ రావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఆర్డీవో రమాదేవి పూలమొక్క అందించి స్వా గతం పలికారు. బాధ్యతల స్వీకరణ అనంతరం కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను నెరవేర్చుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు సజావుగా అమలు చేసేందుకు అధికార యంత్రాంగం తో కలిసి చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. జిల్లాలో పనిచేసిన అనుభవంతో మరింతగా ప్రజలతో మమేకమై అన్నిరంగాల్లో మెదక్‌ను ముందుకు ఉంచడానికి కృషిచేస్తానని కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.