హైదరాబాద్ : అప్పు తిరిగి ఇవ్వమనడమే ఆ వ్యక్తి చేసిన నేరమైంది. అవసరానికి సాయం చేసి ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు దారుణంగా హత్య(Brutal murdered) చేశాడు. ఈ విషాదకర సంఘటన మైలార్‌దేవ్‌పల్లి(Mailardevpally) పోలీస్ స్టేషన్ పరిధిలోని షమా కాలనీలో చేటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సైఫ్ అలియాస్ సాబెర్ అనే వ్యక్తి దగ్గరి బంధువైన ఇస్మాయిల్‌కు 2 లక్షల రూపాయల అప్పు ఇచ్చాడు. కాగా, అప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకు సైఫ్‌ను ఇస్మాయిల్ ఆదివారం ఉదయం 4 గంటల సమయంలో తలపై బండ రాయితో మోది హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.