Praja vani | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన పేరిట రేవంత్ రెడ్డి సంచులు నింపుకోవద్దా..? ఆయన ఉట్టిగనే మందికి వేస్తాడా..? అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజా భవన్లో ప్రజా వాణి కార్యక్రమానికి హాజరైన ఓ మహిళను ప్రజా పాలనపై ఓ యూట్యూబ్ చానెల్ ప్రతినిధి ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు.
వచ్చే సారి రేవంత్ రెడ్డికి ఎవ్వరూ ఓటు వేయరు.. ఆయన ఈ ఐదేండ్లే సీఎంగా ఉంటరు. నువ్వు మంచి పనులు చేస్తే ఈ అయిదేండ్లు కాక పోతే ఇంకో అయిదేండ్లు ఏలుతవు. ఎనిమిది నెలలు అయింది ఆయన ఏ పని చేయలేదు. బస్సు ఒక్కటి ఫ్రీ, రెండు నెలల నుంచి పెన్షన్లు లేవు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు మొన్ననే ఎక్కిండు ఆంధ్రాలో 7 వేలు పెన్షన్ ఇచ్చిండు.. కనీసం వాళ్లని చూసి అయినా మీకు సిగ్గు రావాలి కదా.. రాదు వాళ్లకు సిగ్గురాదు. 4 వేల కాడికి పోయినవ్ 2 వేలే రాలేదు. ఆంధ్రాలో ఏడు వేలు వేసిండు. ఈ హైదరాబాద్ బాగుపడదు అని మండిపడ్డారు ఆమె.
హైదరాబాద్ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన కోసం వేల కోట్ల నిధులు ఇస్తున్నాడు కదా అని సదరు జర్నలిస్టు ప్రశ్నించగా.. సంచులు నింపుకోవద్దా.. ఉట్టిగనే మందికి వేస్తాడా.. ఆయన బాగు పడొద్దా..? ఏది చేసినా ముందు బీదలను ఆదుకోవాలి. మంచి పనులు కూడా చేయ్ అని ఆమె సూచించారు.
వచ్చే సారి రేవంత్ రెడ్డికి ఎవ్వరూ ఓటు వెయ్యరు
నువ్వు మంచి పనులు చేస్తే ఈ అయిదేండ్లు కాక పోతే ఇంకో అయిదేండ్లు ఉంటావు.. ఇన్ని నెలలు అయింది ఆయన వచ్చి, ఒక బస్సు ఫ్రీ తప్ప ఏం చెయ్యలేదు
రెండు నెలల నుండి పెన్షన్ లేదు.. చంద్రబాబు నాయుడు మొన్ననే ఎక్కిండు ఆంధ్రాలో 7 వేలు పెన్షన్… pic.twitter.com/2yRQrlZijB
— Telugu Scribe (@TeluguScribe) July 30, 2024
ఇవి కూడా చదవండి..
Crop Loans | రెండో విడుత రైతు రుణమాఫీ నిధులు విడుదల
KTR | మేం తప్పకుండా సహకరిస్తాం.. వచ్చే సెషన్ 20 రోజులు నిర్వహించాలి : కేటీఆర్