MLA Anil Jadav | మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఫైర్
MLA Anil Jadav | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మండిపడ్డారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా అనిల్ జాదవ్ మాట్లాడారు.
MLA Anil Jadav | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మండిపడ్డారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా అనిల్ జాదవ్ మాట్లాడారు.
ప్రస్తుత ప్రభుత్వంలో మా సమస్యలు ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. ఎస్సీ, ఎస్టీ శాఖలకు మంత్రి లేకపోవడం.. వారి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది రాష్ట్ర ప్రజలకు అర్థమైతుంది. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ వాటి అమలుకు బడ్జెట్లో కేటాయింపులు లేవు. 40 వేల దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున కేసీఆర్ ఆర్థిక సాయం అందించాం. కాంగ్రెస్ పార్టీ దళితబంధు కింద 12 లక్షలు అందిస్తామని చెప్పి బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా మోసం చేసింది. విద్యా జ్యోతి పథకం పేరుతో 10 పాసైన విద్యార్థులకు 10 వేలు, 12 పాసైన విద్యార్థులకు 15 వేలు, డిగ్రీ పాసైన విద్యార్థులకు 25 వేలు, పీజీ పాసైన విద్యార్థులకు రూ. లక్ష, పీహెచ్డీ పాసైన విద్యార్థులకు రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పి కేటాయింపులు చేయలేదు. ఈ పథకాలను ఏ విధంగా అమలు చేస్తారో చెప్పాలి. 15 ఏండ్లు నిండిన విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు. వాటికి కేటాయింపులు లేవు అని అనిల్ జాదవ్ తెలిపారు.
ఎస్టీలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. వాటి ఊసే లేదు. కార్పొరేషన్లకు 25 లక్షల చొప్పున నిధులు ఇస్తామన్నారు. కానీ నిధులు కేటాయించలేదు. ఐటీడీఏ కేంద్రాల్లో సూపర్ స్సెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే గిరిజన ఆదివాసీ బిడ్డలకు ఎంతో కష్టమని చెప్పి కల్యాణలక్ష్మి కింద లక్ష కట్నం అందించి కేసీఆర్ ఆదుకున్నారు. ఈ పథకానికి అదనంగా తులం బంగారం ఇస్తామని అధికారంలోకి వచ్చి 8 నెలలైనా అమలు చేయలేదు అని అనిల్ జాదవ్ గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కుల గుణన చేసి మైనార్టీలకు కూడా సంక్షేమ పథకాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. మైనార్టీ బడ్జెట్ 4 వేల కోట్లకు పెంచి సబ్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పారు. కానీ 2258 కోట్లు మాత్రమే ప్రతిపాదించారు బడ్జెట్లో. మైనార్టీల అభివృద్ధి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని ఆయన పేర్కొన్నారు.
జూన్ 2న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. కానీ అతిగతీ లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. గ్రూప్-1లో 1:100 నిష్పత్తిలో పిలుస్తామన్నారు. గ్రూప్- 2లో 2 వేలు, గ్రూప్- 3లో 3 వేల పోస్టులు పెంచుతామన్నారు. కానీ అమలు చేయడం లేదు. ఉద్యోగాల్లో కేసీఆర్ 95 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. ఎస్టీ రిజర్వేషన్లు కూడా కేసీఆర్ పెంచారు. స్పోర్ట్స్ స్కూల్స్లో స్టాఫ్ కొరతను అధిగమించేలా చర్యలు తీసుకోవాలి. అన్ని గురుకులాలు, మోడల్స్ స్కూల్స్లో అదనపు గదులను నిర్మాణం చేయాలి అని ప్రభుత్వాన్ని అనిల్ జాదవ్ కోరారు.
ఇవి కూడా చదవండి..
KTR | మేం తప్పకుండా సహకరిస్తాం.. వచ్చే సెషన్ 20 రోజులు నిర్వహించాలి : కేటీఆర్
CM Revanth Reddy | 24 గంటల విద్యుత్తుకు ఆద్యుడు చంద్రబాబు..అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ అబద్దాలు
Manjeera | మంజీరలో ఇసుక మాఫియా! చక్రం తిప్పుతున్న కాంగ్రెస్ కీలక నేత
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | ఊబకాయం బాగా ఇబ్బంది పెడుతోందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Crime News | తల్లిని కత్తితో పొడిచి, భవనంపై నుంచి దూకి.. తొమ్మిదో తరగతి బాలుడి ఆత్మహత్య..!
Tirumala News | శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. ఫిబ్రవరి నెల కోటా విడుదల
Bodies of SPOs | దారుణం.. శవపేటికలు లేకుండా డంపర్లో పోలీసుల మృతదేహాలు తరలింపు..!
buses carrying pilgrims collide | యాత్రికులతో వెళ్తున్న రెండు బస్సులు ఢీ.. నలుగురు మృతి, 30 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

