Software Engineer | హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి తన చిన్ననాటి స్నేహితుడు గౌతం రెడ్డి, మరో యువకుడు కలిసి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన గౌతంరెడ్డి, బాధితురాలు ఇద్దరూ కలిసి ఓంకార్ నగర్లో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్‌కు నిన్న సాయంత్రం వచ్చారు. ఆ రెస్టారెంట్లో ఉన్న బార్లో గౌతం రెడ్డి, ఆ యువతి కలిసి మద్యం సేవించి, హోటల్ గదిలోకి వెళ్లారు. మత్తులో ఉన్న యువతికి కాసేపటికి స్పృహ వచ్చింది. గౌతం రెడ్డితో పాటు మరో వ్యక్తి రూమ్‌లో ఉండగా బాధితురాలు కేకలు వేసింది.
హోటల్ సిబ్బంది అప్రమత్తమై ఆమె ఉన్న గది వద్దకు వచ్చేసరికి గౌతం రెడ్డితో పాటు మరో యువకుడు పరారీ అయ్యారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న యువతి గురించి, ఐడీ ప్రూఫ్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు, పోలీసులకు హోటల్ సిబ్బంది సమాచారం అందించారు. బాధితురాలికి స్థానికంగా ఉన్న హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గౌతం రెడ్డితో పాటు అతని స్నేహితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | మేం తప్పకుండా సహకరిస్తాం.. వచ్చే సెషన్ 20 రోజులు నిర్వహించాలి : కేటీఆర్
CM Revanth Reddy | 24 గంటల విద్యుత్తుకు ఆద్యుడు చంద్రబాబు..అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ అబద్దాలు