హైదరాబాద్ : ఫేక్ డాక్యుమెంట్స్‌తో(Fake documents) రిజిస్ట్రేషన్లు చేపిస్తున్న ముఠాను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల(Jeedimetla) పోలీస్ స్టేషన్ పధి సుభాష్ నగర్లో ఫేక్ డాక్యుమెంట్స్ ముఠాను అరెస్ట్ చేశారు. తప్పుడు పత్రాలు, నకిలీ డెత్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్స్ సృష్టించి రిజిస్ట్రేషన్లు చేపిస్తున్న 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సుభాష్ నగర్లో 200 గజాలు, జూబ్లీహిల్స్‌లో 1000 గజాలు, వైజాగ్, హయత్ నగర్ సైట్లకు సైతం ఈ ముఠా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించినట్లు తెలిసింది. నిందితుల నుంచి స్కానర్స్, ఐ రెటీనా మిషన్స్, ల్యాప్ టాప్స్, ఫేక్ డాక్యుమెంట్స్ తో పాటు నాలుగు మొబైల్స్ సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Kick 2 | గెట్ రెడీ డబుల్ కిక్ ఇస్తానంటున్న సల్మాన్ ఖాన్.. కిక్ 2 వచ్చేస్తుంది
Swag Twitter Review | వన్ మ్యాన్ షోలా శ్రీవిష్ణు స్వాగ్.. ఇంతకీ నెట్టింట టాక్ ఎలా ఉందంటే..?
Indian 3 | ఆ వార్తలే నిజమయ్యాయి.. డైరెక్టుగా ఓటీటీలోనే కమల్‌హాసన్ ఇండియన్ 3