Secunderabad | సికింద్రాబాద్‌లోని తాజ్ 3 స్టార్ హోటల్లో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ ముగ్గురు అపస్మారకస్థితిలోకి వెళ్లడాన్ని హోటల్ సిబ్బంది ఇవాళ ఉదయం గుర్తించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆ ముగ్గురిని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం వారు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీరి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హోటల్ గదిలో క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నారాయణ తన భార్య పద్మావతి, కుమారుడు సృజన్‌తో కలిసి తాజ్ త్రీస్టార్ హోటల్లో నిన్న రాత్రి దిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కూల్ డ్రింక్‌లో విషం కలిపి సేవించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 14న సృజన్‌కు వివాహం చేశారు. కోడలు కావ్య తన భర్త సృజన్‌పై చెంచిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోడలు తమపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుందని నారాయణ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది.
ఇవి కూడా చదవండి..
Nampally | మల్లేపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఆరు దుకాణాలు కూల్చివేత..
Hyderabad Metro | మెట్రో మార్గం గజిబిజి.. గందరగోళంగా రెండో దశ కారిడార్లు
TGS RTC | దసరాకు 6,304 ప్రత్యేక బస్సులు.. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు: వీసీ సజ్జనార్