హైదరాబాద్ : లారీని కారు(Car )ఢీ కొట్టడంతో(Road accident )ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర(Keesara) పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కీసరకు సమీపంలోని వర్ధన్ స్కూల్ వద్ద ఆగి ఉన్న లారీని ఎర్టికా కారు వేగంగా వెళ్తూ ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కీసర మండలం రాంపల్లిదాయరకు చెందిన దూసరి సాకేత్ (21), ఇంద్రాసేనారెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. గుర్తించిన స్థానికులు వెంటనే108 అంబులెన్స్ సమాచారమిచ్చారు. క్షతగాత్రులను ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.