Bank Holidays | ఎవరికైనా బ్యాంకులో ఏవైనా పనులు ఉన్నాయా..? అయితే, మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే వరుసగా ఆరురోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఈ క్రమంలో ఏమైనా పని ఉంటే మాత్రం సెలవులు రోజుల్లో వెళ్లి ఇబ్బందులుపడాల్సి వస్తుంది. ముందస్తుగానే సెలవుల గురించి సమాచారం ఉంటే.. పనులన్నీ చక్కబెట్టుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. ఈ వారం ప్రాంతీయ సెలవులు, పండుగలు, వారాంతాలతో సహా బ్యాంకులకు సుదీర్ఘంగా సెలవులు వచ్చాయి. వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు ఈ నెల 13 నుంచి 18 వరకు వరుసగా ఆరు రోజులు పాటు మూతపడే అవకాశం ఉంటుంది. అయితే, రాష్ట్రాల వారీగా సెలవుల్లో మార్పులు ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో పండుగలకు సెలవులు ఉంటాయి. అలాగే, రెండు, నాల్గో శనివారాలతో పాటు ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివుండే విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఇంతకీ బ్యాంకులకు ఆరు రోజులు సెలవులు ఉన్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో ఓ సారి తెలుసుకుందాం రండి..!
ఆర్బీఐ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ 13న రామ్‌దేవ్ జయంతి-తేజ దశమి సందర్భంగా రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవులు. 14న రెండో శనివారం సందర్భంగా బ్యాంకుల మూసివేత. అయితే, అదే రోజున ఓనం పండుగ సైతం ఉన్నది. 15న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. 17న ఈద్ ఎ మిలాద్ సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలీడే. 17న మంగళవారం ఇంద్ర యాత్ర సందర్భంగా సిక్కింలో బ్యాంకులకు సెలవులు. 18న బుధవారం నారాయణ గురు జయంతి సందర్భంగా గ్యాంగ్‌టక్‌లో సెలవు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో శనివారం నుంచి సోమవారం వరకు బ్యాంకులు మూతపడనున్నాయి. వీటితో పాటు రాబోయే వారాల్లో 21న నారాయణగురు సమాధి సందర్భంగా కేరళలో సెలవు ఉంటుంది. 22న దేశవ్యాప్తంగా ఆదివారం సందర్భంగా హాలీడే. 23న హర్యానాలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా సెలవు. ఇక 28, 29 తేదీల్లో శని, ఆదివారాల నేపథ్యంలో బ్యాంకులు మూతపడనున్నాయి.
Fuel Prices | పేట్రేగిన పెట్రో ధరల నుంచి ఉపశమనం : పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపునకు కసరత్తు