భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 18 : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో తయారు చేసిన స్వామి అమ్మవారాలకు పట్టు వస్త్రాలను దేవస్థాన అధికారులకు సమర్పించేందుకు పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం నాయకులు బుధవారం తరలివెళ్లారు. స్థానిక మార్కండేశ్వర స్వామి దేవాలయంలో నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. 15 రోజుల పాటు నియమనిష్టలతో చేనేత మగ్గంపై తయారు చేసిన రెండు పట్టు పంచెలు, రెండు శాలువాలు, రెండు కొత్త కాంబినేషన్లో పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలు తయారు చేసి స్వామివారికి సమర్పిస్తారు. పద్మశాలి నాయకులు, కులస్తులు పురవీధుల గుండా భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా యాదాద్రికి తరలి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి మహాజన సంఘం అధ్యక్షుడు సీత శ్రీరాములు, మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, దేవస్థాన చైర్మన్ సీత సత్యనారాయణ, ఉపాధ్యక్షులు అంక మురళి, భోగ నరసింహ, ప్రధాన కార్యదర్శి భారత బాలరత్నం, సహాయ కార్యదర్శి కడవేరు చంద్రమౌళి, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, నాయకులు గంజి అంజయ్య, గుండు పాండు, కడవేరు వెంకటేశం, సంగెం చంద్రయ్య, చిట్టిమల్ల లక్ష్మీనారాయణ, మిరియాల వెంకటేశం, కర్నాటి అంజమ్మ, భక్తులు పాల్గొన్నారు.